2,786 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
Add ap7am to your home Screen

2,786 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

  • 521 గ్రూప్‌ 4 ఉద్యోగాలు
  • 72 ఆర్టీసీ జూనియర్‌ అసిస్టెంట్లు
  • 700 వీఆర్వోలు
  • 474 మండల ప్లానింగ్‌ ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ తీపి కబురు చెప్పింది. పలు శాఖల్లో 2,786 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందులో 1521 గ్రూప్‌ 4, 72 ఆర్టీసీలో జూనియర్‌ అసిస్టెంట్లు, 700 వీఆర్వోలు, 19 సీనియర్‌ స్టెనో పోస్టులు, 474 మండల ప్లానింగ్‌ ఉద్యోగాలు ఉన్నాయి. ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈనెల 7 నుంచి వచ్చేనెల 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 7న రాతపరీక్ష ఉంటుంది.

ఏఎస్‌వో,  వీఆర్వో పోస్టులకు ఈనెల 8 నుంచి వచ్చేనెల 2 వరకు దరఖాస్తులు స్వీకరించి, ఏఎస్‌వో పోస్టులకు సెప్టెంబరు 2న, వీఆర్వో పోస్టులకు సెప్టెంబరు 16న రాతపరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ చూడొచ్చు.   
Telangana
tspsc
notification

More Telugu News