ఫెమా నిబంధనల ఉల్లంఘన.. బీసీసీఐకి ఈడీ భారీ వడ్డన!
- 2009లో దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ ను నిర్వహించిన బీసీసీఐ
- రూ. 243 కోట్లు సౌతాఫ్రికాకు తరలింపు
- ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఈడీ
ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ, విదేశీ ఖాతాను తెరవకుండానే, రూ. 243 కోట్లను టోర్నీ నిర్వహణ కోసం దక్షిణాఫికాకు బీసీసీఐ తరలించింది. ఇది ఫెమా చట్టాన్ని ఉల్లంఘించడం కిందకు వస్తుంది. ఈ నేపథ్యంలో, దర్యాప్తు చేపట్టిన ఈడీ... బీసీసీఐ ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందనే నిర్ధారణకు వచ్చింది. దీంతో, భారీ జరిమానా విధించింది.