మంత్రివర్గ కూర్పుపై రెండు పార్టీల మధ్య అవగాహన ఏర్పడింది: కర్ణాటక సీఎం కుమారస్వామి
- మంత్రి పదవుల కేటాయింపులపై చర్చించాం
- తలెత్తిన సమస్యలను పరిష్కరించుకున్నాం
- రాహుల్ గాంధీ చాలా చొరవ చూపారు
ఈ విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చాలా చొరవ చూపారని కుమారస్వామి అన్నారు. కాగా, కీలక పదవులయిన హోం శాఖను కాంగ్రెస్‌కు, ఆర్థిక శాఖను జేడీఎస్‌కు ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు నిన్న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.