కర్ణాటక మంత్రి వర్గ కూర్పుపై స్పష్టత!
- ఇప్పటికీ ఏర్పాటు కాని మంత్రివర్గం
- జేడీఎస్‌కు ఆర్థిక శాఖ, కాంగ్రెస్‌కు హోంశాఖ
- సఫలమైన సమావేశం
- ఈరోజు సాయంత్రం ప్రకటన చేసే అవకాశం
ఆర్థికశాఖను సీఎం కుమారస్వామి తీసుకోనుండగా, హోం శాఖ కోసం కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌తో పాటు మరి కొందరు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. మొత్తానికి ఆర్థిక శాఖ జేడీఎస్‌కు, హోం శాఖ కాంగ్రెస్‌కు రానున్నట్లు తేలింది. ఈ రోజు సాయంత్రం కర్ణాటక మంత్రివర్గంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మిగతా శాఖల బాధ్యతలు ఎవరెవరు చేపట్టనున్నారన్న విషయాన్ని వెల్లడించి, త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.