'జై లవ కుశ' తరువాత కెమెరా ముందుకు వచ్చిన నివేదా థామస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జై లవ కుశ' తరువాత కెమెరా ముందుకు వచ్చిన నివేదా థామస్

  • గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్
  • కథానాయికలుగా నివేదా .. షాలిని పాండే
  • గ్యాప్ తరువాత నివేద చేస్తోన్న మూవీ ఇదే
అందం .. అభినయం విషయంలో నూటికి నూరు మార్కులు కొట్టేసిన కథానాయికల జాబితాలో నివేదా థామస్ కనిపిస్తుంది. తెలుగులో వరుస విజయాలను అందుకుంటూ వచ్చిన ఆమె, 'జై లవ కుశ' హిట్ తరువాత చకచకా సినిమాలు చేసేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఆమె గ్యాప్ తీసుకుని తాను అనుకున్న కోర్స్ ను పూర్తి చేసి, తిరిగి సినిమాలపై దృష్టి పెట్టింది.

అలా ఆమె కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతోన్న ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగులో తాజాగా ఆమె జాయిన్ అయింది. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఒక కథానాయికగా షాలినీ పాండే నటిస్తుండగా .. మరో హీరోయిన్ గా నివేదా థామస్ కనిపించనుంది. కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'నా నువ్వే' వచ్చేనెల 14వ తేదీన విడుదల కానుంది. ఆ తరువాత ప్రాజెక్టుగా గుహన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.    
kalyan ram
Niveda Thomas

More Telugu News