కేపీహెచ్ బీ కాలనీలో.. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న మహిళకు మత్తు బిళ్లలు ఇచ్చి, మొత్తం దోచేశారు!

24-05-2018 Thu 10:37 | Telangana
  • పెళ్లి కూతురు మేకప్ బాధ్యతలు ఇస్తామంటూ మాటలు చెప్పిన కిలాడీలు
  • మత్తు బిళ్లలు ఇచ్చి, నగలు దోచేశారు
  • దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు
పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దొంగలు మాత్రం చెలరేగిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీ 6వ ఫేజ్ లో మరో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే, చందానగర్ లో నివాసం ఉంటున్న జ్యోతి మంగేశ్వరి (47) అనే మహిళ కేపీహెచ్ బీ కాలనీలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఓ మహిళ, ఓ యువతి కలసి బ్యూటీ పార్లర్ కు వచ్చారు.

తమ ఇంట్లో పెళ్లి ఉందని, పెళ్లికూతురు మేకప్ కాంట్రాక్ట్ ను మీకు అప్పగిస్తామని నమ్మబలికారు. అయితే, ముందు తమ ఇద్దరిలో ఒకరికి మేకప్ వేసి చూపించాలని, నచ్చితే కాంట్రాక్ట్ మీకేనని చెప్పారు. మేకప్ వేసే సమయంలో ఆభరణాలు ధరించరాదని కండిషన్ పెట్టారు. వారి మాటలను నమ్మిన మంగేశ్వరి... తన ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు, నాలుగు ఉంగరాలు, నాలుగు చేతి గాజులు అల్మారాలో పెట్టి, భద్రపరిచారు.

ఆ తర్వాత మంగేశ్వరిని మాయమాటల్లో పెట్టిన ఇద్దరు కిలాడీలు... ఆమెకు మౌత్ ఫ్రెషనర్ పేరిట మత్తు బిళ్లలను అందించారు. విషయం తెలియని ఆమె ఆ బిళ్లలను చప్పరించి మత్తులోకి జారుకుంది. వెంటనే అల్మారాలో ఉన్న నగలను అపహరించి ఇద్దరూ పరారయ్యారు. ఆ తర్వాత కాసేపటికి మెలుకువ వచ్చిన మంగేశ్వరి అల్మారాలో నగలు కనిపించకపోవడంతో లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు మహిళల కోసం గాలిస్తున్నారు. 
kphb colonytheftbeauty parlour

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more