యూఎస్ లో 55 ఏళ్లు పైబడిన వారికి ‘మహానటి’ ఉచిత ప్రదర్శన

23-05-2018 Wed 21:12 | International
  • మీ వయసు 55 ఏళ్లకు పైబడితే ఈ సినిమా ఉచితంగా చూడండి
  • ఈ శని, ఆదివారాల్లో అవకాశం
  • యూఎస్ లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ ఛాన్స్
ఈ నెల 9న విడుదలైన ‘మహానటి’ చిత్రానికి దేశ విదేశాల్లో మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ సంస్థ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని  చూసేందుకు కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే.. యాభై ఐదేళ్లు పైబడిన వారు ‘మహానటి’ని తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న చిత్రయూనిట్ వృద్ధాశ్రమాల్లో ఉండే వృద్ధుల కోసం ఈ సినిమాను వారి వద్దే ప్రదర్శిస్తామని ప్రకటించింది. తాజాగా,  అమెరికాలో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన నిర్వాణ సినిమాస్ సంస్థ ఓ ప్రకటన చేసింది. ‘పెద్దలందరినీ గౌరవిస్తూ.. మీ వయసు 55 ఏళ్లకు పైబడితే యూఎస్ లో ఈ శనివారం (5/26), ఆదివారం (5/27) ‘మహానటి’ని ఉచితంగా వీక్షించండి. ఈ కింద పేర్కొన్న జాబితాలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది’ అంటూ సంబంధిత పోస్టర్ ను జతపరుస్తూ ఓ ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
mahanatius

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more