ప.గో.జిల్లాలో రోడ్డు ప్రమాదంలో యువతి మృతి... తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య!
- ప.గో జిల్లాలో విషాద ఘటన
- ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న లారీ
- మార్కొండపాడుకు చెందిన యువతీయువకులు
అయితే, ఆ యువతిని ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయింది. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు.. యువతి మృతిని భరించలేక రైల్వే ట్రాకు వైపునకు వెళ్లి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధితులిద్దరూ చాగల్లు మండలం మార్కొండపాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.