సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకారు.. కొట్టిపారేసిన సినీనటి రాధిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకారు.. కొట్టిపారేసిన సినీనటి రాధిక

  • రాధిక బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారంటూ పుకారు
  • తమిళనాట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం
  • నిక్షేపంగా ఉన్నానని చెప్పిన రాధిక
సోషల్ మీడియా పుణ్యమా అని వాస్తవాల కంటే అబద్ధాలే ఎక్కువ ప్రచారం అవుతున్నాయి. జనాలు కూడా అది నిజమా?, అబద్ధమా? అనే విషయాన్ని నిర్ధారించుకోకుండా... తమ వంతుగా తప్పుడు ప్రచారాన్ని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలకు చెందిన వార్తలయితే, మరింత వేగంగా విస్తరిస్తాయి. బతికున్న వారిని కూడా చనిపోయినట్టు ప్రచారం చేయడంలో సోషల్ మీడియా పోషిస్తున్న పాత్ర చాలా గొప్పది.

తాజాగా సీనియర్ నటి రాధికకు సంబంధించి ఓ తప్పుడు ప్రచారం జరుగుతోంది. రాధిక గత కొంత కాలంగా కేన్సర్ తో బాధపడుతున్నారనేదే ఆ వార్త. క్యాన్సర్ కారణంగా ఆమె బయట కూడా కనిపించడం లేదనే పుకారు సోషల్ మీడియా ద్వారా తమిళనాట వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి ఓ అభిమాని ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా రాధికను ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన ఆమె... అదంతా తప్పుడు ప్రచారమేనని, తాను నిక్షేపంగా ఉన్నానని తెలిపారు.
radhika
blood cancer
social media

More Telugu News