యద్దనపూడి మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతాపం

21-05-2018 Mon 12:40 | Both States
  • ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా: చంద్రబాబు
  • సాహిత్య ప్రపంచంలో ఆమెది ప్రత్యేక స్థానం: కేసీఆర్
  • యద్దనపూడి మృతిపై పలువురు రచయిత్రుల సంతాపం
ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు వేర్వేరుగా ప్రకటనలు చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నానని, యద్దనపూడి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.
 
యద్దనపూడి మృతి తీరని లోటంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లుచేశారు. ‘తెలుగు సాహితీ వికాసానికి, నవలా ప్రక్రియను సుసంపన్నం చేయడానికి ఆమె చేసిన రచనలు ఉపయోగపడ్డాయి. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. మానవ సంబంధాలే ఇతి వృత్తంగా చేసిన అనేక రచనలు ఆమెకు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయి’ అని కేసీఆర్ అన్నారు. కాగా, యద్దనపూడి సులోచనారాణి మృతిపై పలువురు రచయిత్రులు తమ సంతాపం తెలిపారు.

 ఎంతో మందిని సాహిత్యం వైపు మళ్లించిన నవలారాణి

ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎంతో మందిని సాహిత్యం వైపు మళ్లించి, కథా సాహిత్యం పట్ల అవగాహన కల్పించిన సులోచనారాణి నవలా రాణి అని రచయిత్రి సమ్మెట ఉమాదేవి ప్రశంసించారు.

 నేను ఏకలవ్య శిష్యురాలిని

యద్దనపూడి సులోచనారాణికి తాను ఏకలవ్య శిష్యురాలినని రచయిత్రి ఉషారాణి అన్నారు. ఆమె నవలల స్ఫూర్తితోనే తాను రచయిత్రిగా మారానని, ఆమె రాసిన నవలలు, సీరియల్స్ కు డైలాగ్స్ రాసే అదృష్టం తనకు లభించిందని, ఆడపిల్లలకు ఆత్మవిశ్వాసం ఉండాలని ఆమె సృష్టించిన ప్రతి పాత్ర ద్వారా చెప్పారని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు కోరుకున్నారు.
 
 సాహితీ ప్రియులకే కాదు రచయితలకూ తీరని లోటు

సులోచనా రాణి మృతి కేవలం సాహితీ ప్రియులకే కాదు రచయితలకూ తీరని లోటని రచయిత్రి కన్నెగంటి అనసూయ అన్నారు. సాహిత్యాన్ని ప్రతిఒక్కరికీ తీసుకెళ్లిన ఘనత సులోచనారాణికే చెందుతుందని అన్నారు.

సులోచనారాణికి చాలా పురస్కారాలు దక్కలేదు

తన లాంటి ఎంతో మంది రచయిత్రులు తయారవడానికి కారణం సులోచనా రాణి అని రచయిత్రి బలభద్రపాత్రుని రమణి అన్నారు. ఎనలేని సాహిత్య సేవ చేసిన ఆమెకు దక్కాల్సిన పురస్కారాలు చాలా మటుకు దక్కలేదని అన్నారు.  
yaddanapudiKCRChandrababu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more