రవితేజ సరసన ఇలియానా .. శ్రుతి హాసన్?

21-05-2018 Mon 10:27 | Entertainment
  • రవితేజ హీరోగా 'అమర్ అక్బర్ ఆంటోని'
  • చకచకా జరుగుతోన్న షూటింగ్ 
  • కథానాయికల ఎంపికపై దృష్టి  
రవితేజ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా రూపొందుతోంది. ఈ మూడు పాత్రల్లోను రవితేజ డిఫరెంట్ గెటప్స్ తో కనిపించనున్నాడు. ఈ మూడు పాత్రలకి జోడీగా ముగ్గురు కథానాయికలను తీసుకోనున్నారు. ఒక హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ డేట్స్ సర్దుబాటు చేయలేనని భావించిన అనూ ఇమ్మాన్యుయేల్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దాంతో ఆ ప్లేస్ లోకి ఇలియానాను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగులో రీ ఎంట్రీ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తోన్న ఇలియానా ఈ ఛాన్స్ వదులుకోక పోవచ్చని అంటున్నారు. ఆమె ఓకే అంటే ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందనడంలో సందేహం లేదు. ఇక మరో కథానాయిక పాత్ర కోసం శ్రుతి హాసన్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.  
ravitejaileanasruthi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more