తంతేగానీ మీకు బుద్ధి రాదయ్యా.. ఎస్పీతో బీజేపీ ఎమ్మెల్యే!

21-05-2018 Mon 07:31 | National
  • వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న బీజేపీ ఎమ్మెల్యేలు
  • దేశవ్యాప్తంగా విమర్శలతో మాట మార్చిన ఎమ్మెల్యే
  • వైరల్ అయిన వీడియో
తంతే గానీ పోలీసులకు బుద్ధి రాదని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ బాజ్‌పాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలహాబాద్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ బాజ్‌పాయిని ప్రవేశ ద్వారం వద్ద ఎస్పీ గంగపార్ సునీల్ సింగ్ అడ్డుకున్నారు.

ఎమ్మెల్యేను గుర్తుపట్టకపోవడమే ఇందుకు కారణం. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘తంతే కానీ మీకు బుద్ధి రాదు’ అని అర్థం వచ్చేలా తిట్ల పురాణం అందుకున్నారు. అందరూ చూస్తుండగానే పోలీసు అధికారిపై ఎమ్మెల్యే విరుచుకుపడడాన్ని చూసి, అందరూ విస్తుపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యేను లోపలికి పంపడంతో వివాదం అప్పటికి సద్దుమణిగింది. ఎస్పీపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో వైరల్ అయింది. ఎమ్మెల్యే తీరుపై దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పోలీసుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  

తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన  హర్షవర్ధన్.. తాను అలా అనలేదని, సీనియర్ మంత్రులను గౌరవించని పోలీసు అధికారులను తీవ్రంగా పరిగణిస్తామని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపనున్నట్టు అలహాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నితిన్ తివారీ తెలిపారు.
BJPUttar PradeshHarshvardhan Bajpayee

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more