సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

21-05-2018 Mon 07:20 | Entertainment
  • రజనీకాంత్ సినిమాలో తెలుగమ్మాయి?
  • మళ్లీ కెమెరా ముందుకు నమిత 
  • 'సాహో'కు 'బాహుబలి' టెక్నీషియన్
  • 'మహానటి' హక్కులకు భారీ రేటు 
*  రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందే సినిమాలో తెలుగమ్మాయి అంజలి ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలొస్తున్నాయి. దీనిపై అంజలిని అడిగితే, ఈ విషయంపై అప్పుడే మాట్లాడనంటూ తప్పించుకుంది. అంటే, అధికారికంగా చిత్రం యూనిట్ ప్రకటిస్తుందన్న జవాబు ఆమె మాటల్లో కనిపిస్తోంది.
*  ఆమధ్య పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిన బొద్దుగుమ్మ నమిత మళ్లీ ఇప్పుడు కెమెరా ముందుకు రావడానికి సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు టి.రాజేందర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో లేడీ విలన్ పాత్రను ఆమె పోషించనున్నట్టు సమాచారం.
*  'బాహుబలి' చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రముఖ టెక్నీషియన్ కమల్ కన్నన్ తాజాగా 'సాహో' చిత్రానికి కూడా వీఎఫ్ఎక్స్ పనులను చేబడుతున్నాడు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది.
*  సావిత్రి బయోపిక్ గా వచ్చిన 'మహానటి' చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ చిత్రం శాటిలైట్ హక్కులకు విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ హక్కులను జీటీవీ 18 కోట్లు ఆఫర్ చేసి సొంతం చేసుకున్నట్టు సమాచారం. 
AnjaliRajaniPrabhas

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more