జగన్ కు మంత్రి ఆదినారాయణరెడ్డి కోవర్టుగా వ్యవహరిస్తున్నారు: టీడీపీ నేత వీరశివారెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ కు మంత్రి ఆదినారాయణరెడ్డి కోవర్టుగా వ్యవహరిస్తున్నారు: టీడీపీ నేత వీరశివారెడ్డి

  • కడప జిల్లా టీడీపీలో భగ్గుమన్న విభేదాలు!
  • ఆదినారాయణరెడ్డి కుటుంబానికి జగన్ తో రహస్య సంబంధాలు  
  • జగన్ తో ఆదినారాయణరెడ్డి సోదరుడు టచ్ లో ఉన్నారు
కడప జిల్లా టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. మంత్రి ఆదినారాయణరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ కు మంత్రి ఆదినారాయణరెడ్డి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదినారాయణరెడ్డి కుటుంబానికి జగన్ తో రహస్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.

జగన్ తో ఆదినారాయణరెడ్డి సోదరుడు టచ్ లో ఉన్నారని ఆరోపించిన ఆయన, పార్టీ టికెట్ ఇస్తామంటూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆదినారాయణరెడ్డి అసమ్మతి రాజేస్తున్నారని అన్నారు. కడప జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో రెండు మినీ మహానాడు కార్యక్రమాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని వీరశివారెడ్డి విమర్శించారు.
Jagan
Telugudesam
veera siva reddy

More Telugu News