యడ్యూరప్పతో కేంద్ర మంత్రి అనంతకుమార్‌ కీలక సమావేశం

  • అసెంబ్లీ గ్యాలరీలో ఇప్పటివరకు ప్రకాశ్‌ జవదేకర్, మురళీధర్‌రావు 
  • అక్కడి నుంచి వెళ్లిపోయిన వైనం
  • రసకందాయంలో కర్ణాటక రాజకీయాలు
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేస్తారని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు విధానసౌధలోని సీఎం ఛాంబర్‌లో యడ్యూరప్పతో కేంద్ర మంత్రి అనంతకుమార్‌ సమావేశం కావడం మరింత ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఇప్పటివరకు కర్ణాటక అసెంబ్లీ గ్యాలరీలో కూర్చున్న కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. యడ్యూరప్ప రాజీనామా చేస్తారన్న ప్రచారంతో కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. యడ్యూరప్ప విశ్వాస పరీక్షను ఎదుర్కుంటారా? అన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది.  
Go Back to Shorts
yaddyurappa
Congress
BJP

More Telugu News