సీనియర్ నటి వాణిశ్రీ సోదరి మృతి !

  • నటి వాణిశ్రీ సోదరి కాంతమ్మ (70) గుండెపోటుతో మృతి
  • చెన్నైలోని స్వగృహంలో కన్నుమూత
  • పలువురు సంతాపం
టాలీవుడ్ సీనియర్ నటి వాణిశ్రీ ఇంట విషాదం నెలకొంది. ఆమె సోదరి కాంతమ్మ (70) గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని తన స్వగృహంలో ఈరోజు ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా, కాంతమ్మ స్వస్థలం నెల్లూరు. ఆమె బంధువులు అమెరికాలో ఉండటంతో వారు ఇక్కడికి వచ్చిన తర్వాతే  అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం.  కాగా, సోదరి మృతిపై సంతాపం తెలుపుతూ పలువురు ప్రముఖులు వాణిశ్రీకి సందేశాలు పంపారు.
Go Back to Shorts
Tollywood
artist vanisri

More Telugu News