Andhra Pradesh: మావోయిస్టు నేత ఆర్కే (రామకృష్ణ)ను చుట్టుముట్టిన గ్రేహౌండ్స్... భారీ ఎన్ కౌంటర్!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని బలిమెల రిజర్వాయర్ పరిధిలో కూంబింగ్ చేపట్టిన గ్రేహౌండ్స్ దళాలకు కీలక మావోయిస్టు నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే తారసపడినట్టు తెలుస్తోంది. సిమిలి సొదర్ అడవుల్లో మావోలకు, పోలీసులకు మధ్య ఈ ఉదయం నుంచి భారీ ఎన్ కౌంటర్ జరుగుతోందని, ఇరువైపుల నుంచి తుపాకులు పేలుతున్నాయని, ఇంతకుమించి ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఆర్కే ఈ ప్రాంతంలోనే ఉన్నాడని తెలుస్తుండగా, ఈ విషయమై అధికారికంగా స్పందించడానికి ఆయన నిరాకరించారు. కాగా, ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతుందని వార్తలు వస్తున్నాయి. మరింత సమాచారం వెలువడాల్సి వుంది.
Go Back to Shorts
Andhra Pradesh
Odisha
Border
RK
Akkiraju Ramakrishna
Encounter
Police
Grehounds

More Telugu News