కర్ణాటక గవర్నర్ ముందున్న మూడు ప్రత్యామ్నాయాలు ఇవే!

16-05-2018 Wed 10:25 | National
  • కర్ణాటకలో ఏ పార్టీకీ దక్కని మెజారిటీ
  • రాజ్ భవన్ కు మారిన పొలిటికల్ సీన్
  • మోదీకి అత్యంత సన్నిహితుడు కర్ణాటక గవర్నర్
కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో... అక్కడి రాజకీయ పరిణామాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఇప్పుడు పొలిటికల్ సీన్ మొత్తం రాజ్ భవన్ కు మారింది. గవర్నర్ వజూభాయ్ వాలా తీసుకునే నిర్ణయంపైనే కర్ణాటక రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది. అధికారాన్ని దక్కించుకోవడానికి ఒకవైపు బీజేపీ, మరోవైపు జేడీఎస్, కాంగ్రెస్ కూటమి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, గవర్నర్ ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అవి ఏంటంటే...
  • సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం. బల నిరూపణ కోసం ఆ పార్టీకి గడువు ఇవ్వడం. 
  • కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన కుమారస్వామిని ఆహ్వానించడం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరడం. ఈ రెండు పార్టీలకు కలిపి 116 సీట్లు ఉన్నాయి. దీంతో, మ్యాజిక్ ఫిగర్ కంటే ఈ కూటమికి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు. 
  • చివరి ప్రత్యామ్నాయం అత్యంత వివాదాస్పదమైనదిగానే చెప్పుకోవచ్చు. అదేంటంటే... ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా అసెంబ్లీని సస్పెన్షన్ లో ఉంచడం.

మరోవైపు, నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన వజూభాయ్ వాలా... ప్రభుత్వ ఏర్పాటుకు కుమారస్వామికి తొలి అవకాశం దాదాపు ఇవ్వకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు... ఆయన కేబినెట్లో వజూభాయ్ ఉన్న విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో, ఫస్ట్ ఛాన్స్ యడ్యూరప్పకే ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ యడ్యూరప్ప బలనిరూపణలో విఫలమైతేనే కుమారస్వామికి అవకాశం దక్కే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇక మూడో ప్రత్యామ్నాయం అవసరం రాకపోవచ్చనే అంటున్నారు. 
karnatakaelectionsgovernor

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more