కృష్ణగారితో చాలా పెద్ద గొడవే అయింది!: తమ్మారెడ్డి భరద్వాజ

15-05-2018 Tue 15:35 | Entertainment
  • కృష్ణగారితో 'రౌడీ అన్నయ్య' చేశాను 
  • ఒక సాంగ్ విషయంలో పేచీ వచ్చింది 
  • నా నిర్ణయం ఆయనకి కోపం తెప్పించింది
దర్శక నిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజకి ఎంతో అనుభవం వుంది. తాజాగా 'అలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 'రౌడీ అన్నయ్య' సినిమా సమయంలో సూపర్ స్టార్ కృష్ణతో జరిగిన గొడవను గురించి ప్రస్తావించారు. "కృష్ణగారితో సినిమా తీయాలనుకుంటున్నప్పుడు .. సత్యమూర్తి దగ్గర మంచి కథ వుంది తీసుకోమన్నారు .. ఆ కథ నాకు కూడా బాగా నచ్చింది. సినిమా షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి క్లైమాక్స్ సీన్ కి ముందు వచ్చే సాంగ్ విషయంలో మా మధ్య పేచీ నడుస్తూనే వుంది"

"బాబూ మోహన్ తో చేసే ఆ సాంగ్ లో కృష్ణగారు కనిపించకూడదని నేను అంటాను. తాను కనిపించకపోతే ఎలా అంటారు ఆయన. దాంతో ఇటు కృష్ణగారితోను .. ఆయనకి తెలియకుండా అటు బాబుమోహన్ తోను సాంగ్ చేయడం జరిగింది. సెన్సార్ కి మాత్రం బాబుమోహన్ సాంగ్ ఉండేలా చూశాను. ఆ సాంగ్ పట్ల సెన్సార్ వారు అభ్యంతరం చెప్పడంతో కృష్ణగారు జోక్యం చేసుకోవడం .. సెన్సార్ ఆఫీస్ కి వెళ్లి ఆ సాంగ్ చూడటం జరిగిపోయింది. తన సాంగ్ కాకుండా బాబూమోహన్ సాంగ్ ఉండటం చూసి ఆయనకి కోపం వచ్చేసింది. నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ రోజుతో తమ ఫ్రెండ్షిప్ కట్ అని చెప్పేసి వెళ్లిపోయారు" అంటూ చెప్పుకొచ్చారు .            
tammareddy bharadwaja

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more