దళితుడికి సీఎం పదవి అప్పగించేందుకు రెడీ: సీఎం సిద్ధరామయ్య

13-05-2018 Sun 17:07 | National
  • ఒకవేళ కర్ణాటకలో ‘హంగ్’ ఏర్పడితే ఏం చేయాలనే దానిపై దృష్టి
  • జేడీఎస్ మద్దతు కోసం ‘కాంగ్రెస్’ వ్యూహం
  • ఆ పార్టీ మద్దతు కోసమే ఈ ప్రకటన చేసిన సిద్ధరామయ్య?
కర్టాటక అసెంబ్లీ ఎన్నికలు నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమదే విజయం అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష, విపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేశాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ వస్తుందని తేలింది. ఒకవేళ హంగ్ అసెంబ్లీ వస్తే జేడీఎస్ కింగ్ మేకర్ అయ్యే అవకాశముంది. ఈ ఫలితాలు నిజమై..‘హంగ్’ ఏర్పడితే ఏం చేయాలనే దానిపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి.

ఈ నేపథ్యంలో జేడీఎస్ మద్దతు కోసం ‘కాంగ్రెస్’ వ్యూహం సిద్ధం చేస్తోంది. ఈ సందర్భంగా సీఎం సిద్ధ రామయ్య ఓ కీలక ప్రకటన చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని దళితుడికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పదవిని ఎవరికి కట్టాబెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకునేది అధిష్ఠానమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్ధరామయ్య ఓ మెలిక పెట్టారు.

గెలిచిన ఎమ్మెల్యేల మాటను అధిష్ఠానం వినాలని, వారి ఇష్టాయిష్టాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని దళితుడికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఒకవేళ ‘హంగ్’ ఏర్పడితే.. జేడీఎస్ మద్దతు కోసమే సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Karnatakasiddha ramaiah

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more