హైదరాబాద్ ఎస్‌బీఐ ఏటీఎం నుంచి చిరిగిన, ఇంకు మరకలున్న రూ.2 వేల నోట్లు.. లబోదిబోమన్న బాధితుడు!

13-05-2018 Sun 07:30 | Telangana
  • రూ.పది వేలు డ్రా చేసిన వినియోగదారుడు
  • చిరిగిన, ఇంకు మరకలున్న నోట్లు వచ్చిన వైనం
  • ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మార్చుకోమంటూ స్టేట్‌బ్యాంకు ట్వీట్
హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి చిరిగిన, మరకలున్న రూ.2వేల నోట్లు వస్తున్నాయి. శుక్రవారం రాత్రి వనస్థలిపురంలోని ఓ ఎస్‌బీఐ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసిన ఓ వ్యాపారి చిరిగిన, పూర్తిగా నలిగిన, మరకలున్న నోట్లు రావడం చూసి అవాక్కయ్యాడు. అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదును సోమవారం భారతీయ స్టేట్ బ్యాంకుకు పంపి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరనున్నట్టు చెప్పారు.

వనస్థలిపురం బ్రాంచ్  ఏటీఎం నుంచి శ్రీకర్ ఆదిత్య అనే వ్యక్తి రూ.10 వేలు డ్రా చేశారు. ‘‘నోట్లు చూసి నేను ఆశ్చర్యపోయాను. రెండు నోట్లు పూర్తిగా చిరిగిపోయి ఉన్నాయి. రెండు నోట్లపై ఇంకు మరకలు ఉన్నాయి. ఒక నోటుపై స్టిక్కర్లు వేసి ఉన్నాయి. నోట్లపై కొన్ని నంబర్లు కూడా మిస్సయ్యాయి’’ అని పేర్కొన్నారు. వాటిలో ఒక్కటి కూడా ఉపయోగించడానికి వీల్లేకుండా ఉందని శ్రీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నోట్లను వెంటనే పక్కనే ఉన్న డిపాజిట్ మెషిన్లో డిపాజిట్ చేసేందుకు ప్రయత్నిస్తే మిషన్ వాటిని తీసుకోలేదని వివరించారు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చానని పేర్కొన్నారు.

ఏటీఎంకి డబ్బులు పంపించే ముందు నోట్ల క్వాలిటీని, ప్రామాణికతను పూర్తిగా పరీక్షిస్తామని, ఒకవేళ చిరిగిన నోట్లు వచ్చాయంటే నిర్లక్ష్యం వల్లే అలా జరిగి ఉంటుందంటూ ఆదిత్య ట్వీట్‌కు ఎస్‌బీఐ రిప్లై ఇచ్చింది. చిరిగిన నోట్లను ఏదైనా ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మార్చుకోవాలని సూచించింది.
HyderabadSBIATMNotes

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more