అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లదాడి జరగలేదు!: డీజీపీ వివరణ
- కాన్వాయ్ లోని ఏడో కారు కొంచెం నెమ్మదిగా వెళ్లింది
- సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కర్రతో అద్దం పగలగొట్టారు
- కేసు నమోదు చేశాం.. ఒకరిని అరెస్ట్ చేశాం
ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ఒకర్ని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని చెప్పారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుంటామని... పోలీసు సిబ్బంది తప్పుందని తేలినా చర్యలు తప్పవని తెలిపారు. అలిపిరి ఘటనపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ డీజీపీ ఈ మేరకు స్పందించారు.