చిన్న వయసు నుంచే నేను సావిత్రిగారికి అభిమానిని!: చిరంజీవి

12-05-2018 Sat 14:50 | Entertainment
  • 'మ‌హాన‌టి' చిత్ర ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల్ని స‌న్మానించిన మెగాస్టార్
  • తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతిని, కీర్తిని పెంచారు
  • ఈ సినిమాకు రివార్డులే కాదు.. అవార్డులు కూడా వ‌స్తాయి
కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మించిన 'మ‌హాన‌టి' ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆ చిత్ర ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల్ని ఈరోజు ఉదయం తన ఇంటికి ఆహ్వానించి స‌న్మానించారు.

అనంత‌రం చిరంజీవి మాట్లాడుతూ.. "నా అభిమాన న‌టి సావిత్రి గారు. నేను మొద‌టిసారి 'పునాది రాళ్లు' సినిమాలో కెమెరా ముందు నిల‌బ‌డ్డాను. అందులో సావిత్రి హీరోకి త‌ల్లిగా న‌టించారు. హీరో స్నేహితుల పాత్ర‌ల్లో నాది ఒక‌టి. ఆ సినిమాలో రెండు మూడు సీన్లలో సావిత్రి గారితో ప‌నిచేసే అవ‌కాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. చిన్న వ‌య‌సు నుంచే ఆమెకు నేను వీరాభిమానిని. ఆ విష‌యాలు ఆమెతో చెప్ప‌గానే నా గురించి అడిగి, భ‌విష్య‌త్ లో పెద్ద‌స్టార్ అవ్వాల‌ని దీవించారు. అది అద్భుత‌మైన సంఘ‌ట‌న‌.

అలాంటి మ‌హాన‌టిపై నిర్మాత ద‌త్ గారు బ‌యోపిక్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. నాగ్ అశ్విన్ యంగ్ డైరెక్ట‌ర్. త‌న తొలి సినిమా బాగుంది. కానీ త‌న అనుభ‌వంతో ఈ సినిమా ఎలా చేయ‌గ‌ల‌డ‌నే మీమాంస నాలో ఉండేది. ఎంత‌వ‌ర‌కూ దీనికి న్యాయం చేయగ‌ల‌డ‌ని సందేహాలుండేవి. కానీ, సినిమా చూసిన త‌ర్వాత నా అనుమానాలు పటాపంచలు అయిపోయాయి.

సినిమా చూస్తున్నంత సేపు హృదయం బ‌రువెక్కింది. క‌ళ్లు చెమ‌ర్చాయి. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతిని, కీర్తిని జాతీయ‌, అంత‌ర్జాతీయంగా మరో మెట్టు ఎక్కించారు. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టించింది అన‌డం కంటే జీవించింది అన‌డం క‌రెక్ట్. దుల్కర్ సల్మాన్ జెమిని గ‌ణేష్ గారిలానే అద్భుతంగా న‌టించారు. ఈ సినిమాకు రివార్డులే కాదు.. అవార్డులు కూడా వ‌స్తాయి. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో అవార్డులు రావాలి.

మే 9న నా 'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి' సినిమా రిలీజైంది. అదే రోజున 'మ‌హాన‌టి' కూడా రిలీజైంది. అనుకోకుండా జ‌రిగిందో.. కావాల‌ని అలా ప్లాన్ చేశారో తెలియ‌దు గానీ, చాలా సంతోషంగా ఉంది. అందుకు మ‌హాన‌టి టీమ్ అంద‌ర్నీ అభినందిస్తున్నాను'' అన్నారు. ఈ స‌మావేశంలో అశ్వినీ దత్, నాగ్ అశ్విన్, స్వప్న దత్, ప్రియాంక దత్ లు పాల్గొన్నారు.
ChiranjeevimegastarmahanatiTollywoodHyderabad

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more