నేను పర్యటనలకు వెళ్లబోయే ముందు ఈ సినిమా చూస్తా!: పవన్ కల్యాణ్
Add ap7am to your home Screen

నేను పర్యటనలకు వెళ్లబోయే ముందు ఈ సినిమా చూస్తా!: పవన్ కల్యాణ్

  • ‘నా పేరు సూర్య’ సినిమా చూడాలనిపిస్తోంది
  • ఈ వేసవికి ఒక మంచి సినిమా వచ్చినందుకు సంతోషంగా ఉంది
  • అల్లు అర్జున్ మంచి సినిమాలు చేయాలి
తను పర్యటనలకు వెళ్లబోయే ముందు ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా చూసి వెళ్లాలని నిర్ణయించుకున్నానని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ లో ‘నా పేరు సూర్య’ సక్సెస్ మీట్ కు ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ‘నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకు .. ప్రతి ఒక్కరికీ నమస్కారాలు. ‘నా పేరు సూర్య’ సినిమాను మీతో పాటు నాకు కూడా చూడాలనిపిస్తోంది.  ఈ సినిమా ట్రైలర్స్ చూస్తుంటే సినిమా చాలా బాగుందనిపించింది. అర్జున్ లాంటి పెద్ద హీరోతో వక్కంతం వంశీ పెద్ద సినిమా తీసి సక్సెస్ చేశారు. ఈ వేసవికి ఒక మంచి సినిమా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

అల్లు అర్జున్ ‘ఆర్య’ సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. ముందు ముందు అల్లు అర్జున్ మంచి సినిమాలు చేయాలి. గొప్ప విజయాలు సాధించాలి. అల్లు అర్జున్ తన తల్లిదండ్రులకు, తాతయ్యకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని అన్నారు.
Pawan Kalyan
Allu Arjun
nsni

More Telugu News