ఆ బిడ్డలిద్దరూ నిండు నూరేళ్లు అయురారోగ్యాలతో ఉండాలి: మోహన్ బాబు
- ఈరోజే విడుదలైన 'మహానటి'
- ఎస్.వి. రంగారావు పాత్రలో మోహన్ బాబు
- నిర్మాత అశ్వినీదత్ కుమార్తెలు డబ్బుకు వెనుకాడక 'మహానటి' తీశారు
'అశ్వినీదత్ ఒక మంచి నిర్మాత. అతని కుమార్తెలిద్దరూ ధైర్యం చేసి డబ్బుకు వెనుకాడక 'సావిత్రి' జీవిత చరిత్రని సినిమాగా తీశారు. గొప్ప విజయాన్ని సాధించిందని విన్నాను. అటువంటి మంచి సినిమాలో నాకూ ఒక మంచి పాత్రనిచ్చి 'శభాష్' అనిపించుకునేలా చేశారు. ది క్రెడిట్ గోస్ టూ ది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్. ఆ బిడ్డలు చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైనందుకు ఆ భగవంతుడు వారికీ నిండు నూరేళ్ళు ప్రసాదించాలనీ, అయురారోగ్యాలతో ఉండాలని, ఇటువంటి మంచి చిత్రాలు మరెన్నో తీయ్యాలని ఆ బిడ్డలనిద్దరినీ ఆశీర్వదిస్తున్నాను' అంటూ మోహన్ బాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.