ఆడపిల్లల జోలికొస్తే ఖబడ్దార్‌: ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు హెచ్చరిక

07-05-2018 Mon 20:24 | Andhra
  • దారుణాలకు పాల్పడిన వారు భూమి మీద ఉండడానికి వీల్లేదు
  • మనందరి ఆలోచనా విధానంలో మార్పు రావాలి
  • ఇంటర్నెట్‌తో చిన్నపిల్లలు తప్పుడు దారుల్లో వెళుతున్నారు
  • దాచేపల్లి లాంటి ఘటన అదే చివరిది కావాలి
'ఆడపిల్లల జోలికొస్తే ఖబడ్దార్‌' అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవల గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై అఘాయిత్యం జరిగినప్పుడు నిందితుడిని పట్టుకోవడానికి 17 పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని, డ్రోన్లతోనూ గాలించామని అన్నారు. ఇలాంటి ఘటనల్లో నిందితుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని చెప్పారు. ఇటువంటి దారుణాలకు పాల్పడిన వారు భూమి మీద ఉండడానికి వీలులేదని అన్నారు.
 
‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ అనే నినాదంతో విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు సాగిన ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని, అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో టెక్నాలజీ బాగా అందుబాటులో ఉందని, మంచిగా వాడుకుంటే ఎంతగానో ఉపయోగపడుతుందని చంద్రబాబు అన్నారు.

అలాగే ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడంతో చిన్నపిల్లలు తప్పుడు దారుల్లో వెళుతున్నారని, మనందరి ఆలోచనా విధానంలో మార్పు రావాలని అన్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతోన్న దారుణాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందని అన్నారు. దాచేపల్లి లాంటి ఘటన అదే చివరిది కావాలని,  మరోసారి ఇటువంటి ఘటన జరిగితే నిందితులకు అదే చివరి దినం కావాలని వ్యాఖ్యానించారు.              
ChandrababuAndhra PradeshTelugudesam

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more