మరోసారి సమ్మెకు దిగనున్న బ్యాంకు ఉద్యోగులు?

07-05-2018 Mon 13:53 | Andhra
  • వేతనాల పెంపు విషయమై జరిగిన చర్చలు విఫలం
  • మా నిజమైన డిమాండ్లను నెరవేర్చాలి  
  • లేనిపక్షంలో ఈ నెలఖారులో రెండు రోజులు సమ్మెకు దిగుతాం
  •  హెచ్చరించిన బ్యాంకు ఉద్యోగులు
 వేతనాల పెంపు విషయమై కేంద్ర ఆర్థిక శాఖపై అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎఐబీఈఏ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఒత్తిడి తేవడంలో విఫలమయ్యాయని బ్యాంకు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మెకు దిగనున్నారు. బ్యాంకు ఉద్యోగుల నిజమైన డిమాండ్లను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

బ్యాంకు ఉద్యోగుల వేతనాలను 2 శాతం పెంచేందుకు మాత్రమే ఐబీఏ ముందుకొచ్చిందని, గతంలో జరిగిన 15 శాతం పెంపు ఒప్పందానికి ఇది విరుద్ధమని ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ డిమాండ్లపై స్పందించకపోతే ఈ నెలాఖరులో రెండు రోజులు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

కాగా, వేతనాల పెంపు విషయమై యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్లు (యూఎఫ్ బీయూ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐఓబీ)కు మధ్య నిన్న జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన పది లక్షల మందికి పైగా ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.

ఐబీఏ ఆఫర్ చేసే మొత్తం చాలా తక్కువగా ఉంది

2012 నవంబర్ 1న పదవ బిపర్ టైట్ వేతన ఒప్పందం జరిగిందని, ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం వేతన బిల్లులో పదిహేను శాతానికి పైగా పెంపుదలను ఐబీఏ ఆఫర్ చేయనున్నట్టు తెలిపిందని అఖిల భారత బ్యాంకు ఎంప్లాయూస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు.

అయితే, ఈ పెంపును రెండు శాతం మాత్రమే చేపట్టనున్నట్టు గత ఏడాది మార్చి 3న ఐబీఏ ప్రకటించిందని, ఈ పెంపు చాలా తక్కువగా ఉందని  అన్నారు.  ఈ విషయమై ఆర్థిక మంత్రిత్వ శాఖ తక్షణం జోక్యం చేసుకోవాలని, ఈ విషయంలో మంత్రిత్వ శాఖ కూడా విఫలమైతే నలభై ఎనిమిది గంటల పాటు సమ్మెకు దిగక తప్పదని హెచ్చరించారు.
bankersaibeaiba

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more