అందుకే, సుల్తాన్ ల జయంతిని సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్వహిస్తోంది!: ప్రధాని మోదీ

06-05-2018 Sun 15:38 | National
  • కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ
  • చరిత్రను కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోంది
  • ప్రజల భద్రతకు, అభివృద్ధికి తాను కంకణబద్ధుడనై ఉన్నా
కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే సుల్తాన్ ల జయంతులను సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్వహిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్రదుర్గలో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, సమాజాన్ని విడగొట్టే కుట్రలో భాగంగానే చరిత్రను కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని, కేవలం ఒక కుటుంబ కోసం ఎందరో జాతీయ నాయకులను, వీరులను కాంగ్రెస్ పార్టీ వెనక్కి నెట్టేసిందని ఆరోపించారు.

కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందేమోనని కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని, ప్రజలను లూటీ చేసే అధికారం చేజారిపోతుందేమోనని ఆ పార్టీ కలత చెందుతోందంటూ ఎద్దేవా చేశారు. దళిత, ఓబీసీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, వారికి అండగా ఉండేది బీజేపీ ఒక్కటేనని అన్నారు. పేద బీసీ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ప్రధాని కావడాన్ని, పేద కుటుంబానికి చెందిన మరో వ్యక్తి రాష్ట్రపతి అవడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని మోదీ విమర్శించారు.

తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎదురుదెబ్బ తగిలినట్లు కాంగ్రెస్ కు అర్థమైందని, కాంగ్రెస్ పార్టీ నేతల కాళ్ల కింద భూమి కంపించిందని, అందుకే, రోజుకో అబద్ధం చెబుతోందని విమర్శించారు. దళితులు, ఆదివాసీలు, పీడితులు, మహిళలకు భరోసా ఇస్తున్నానని ప్రజల మధ్య నుంచి వచ్చానని, వారి మధ్యలోనే పెరిగానని .. ప్రజల భద్రతకు, అభివృద్ధికి తాను కంకణబద్ధుడనై ఉన్నానని మోదీ హామీ ఇచ్చారు.
modisidha ramaiah

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more