ఇద్దరమూ జంప్ జిలానీలమే... నీ అదృష్టం బాగుందంతే!: మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఎమ్మెల్యే జయరాములు నిప్పులు!

06-05-2018 Sun 09:12 | Both States
  • బద్వేలులో మంత్రి ఆదినారాయణరెడ్డి బైక్ ర్యాలీ
  • తనకు చెప్పకుండా ఎలా చేస్తారన్న ఎమ్మెల్యే జయరాములు
  • ఎస్సీ నియోజకవర్గంలో ఆధిపత్యం చూపుతున్నారని విమర్శలు
తనకు తెలియకుండా తన నియోజకవర్గ పరిధిలోని పోరుమామిళ్లలో మంత్రి ఆదినారాయణరెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించడంపై బద్వేలు ఎమ్మెల్యే జయరాములు మండిపడ్డారు. ఇదే సందర్భంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ విజయజ్యోతి తదితరులపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఇద్దరమూ జంప్ జిలానీలమేనని, వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చామని గుర్తు చేసిన ఆయన, అదృష్టం బాగుండి ఆదినారాయణరెడ్డి మంత్రి అయ్యారని, తాను కాలేదని వ్యాఖ్యానించారు. డబ్బు సంపాదనకే రాజకీయాల్లోకి ఆది వచ్చారని, తాను ప్రజా సేవ చేసేందుకు వచ్చానని అన్నారు. ఆయన నియోజకవర్గానికి చెప్పకుండా తాను వెళ్లి ర్యాలీలు నిర్వహిస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.

పార్టీ కార్యక్రమాలకు కూడా తనను పిలవడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను కలసి పోదామని భావిస్తున్నా ఇన్ చార్జ్ విజయమ్మ వినడం లేదని, బద్వేలులో అందరమూ కలసి ఒకేచోట దీక్ష చేద్దామంటే వినకుండా వేర్వేరు శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. దళితుడినని తనపై చిన్నచూపు చూస్తున్నారని, ఎస్సీలకు రిజర్వ్ అయిన నియోజకవర్గంలో అగ్రవర్ణాల పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నించారు. చేతనైతే ఇతర నియోజకవర్గాలకు వెళ్లి ఇలాగే ఆధిపత్యం చెలాయించాలని జయరాములు సవాల్ విసిరారు.
BudvwlJayaramuluAdinarayana Reddy

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more