స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించిన వైసీపీ నాయకుడు అరెస్టు

04-05-2018 Fri 11:59 | Andhra
  • బాల్య స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించిన నర్సింగ్
  • లాడ్జికి తీసుకెళ్లి అత్యాచార యత్నం
  • అరెస్టు.. గుంటూరు జిల్లా జైలుకు తరలింపు
స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించిన గుంటూరు జిల్లా వైసీపీ నాయకుడు, మాచర్ల మాజీ ఎంపీపీ రమావత్ నర్సింగ్ నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండాకు చెందిన రమావత్ నర్సింగ్ నాయక్ గతంలో వైసీపీ తరపున మాచర్ల ఎంపీపీగా పనిచేశారు. అదే గ్రామంలో వైసీపీకి చెందిన ఓ యువకుడు నాయక్ కు బాల్య స్నేహితుడు. రెండు కుటుంబాల మధ్య స్నేహసంబంధాలు ఉన్నాయి. ఆ యువకుడి భార్య తాడేపల్లి మండలానికి చెందిన వ్యక్తి. గత నెల 27న తమ స్వగ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లే నిమిత్తం నర్సింగ్ నాయక్ తో కలిసి అచ్చమ్మకుంట నుంచి బయలుదేరింది.

గుంటూరులోని హిందూకళాశాల వద్ద వారు బస్సు దిగారు. హోటల్ లో భోజనం చేసి వెళదామని ఆమెకు నర్సింగ్ నాయక్ చెప్పాడు. కానీ, అక్కడి రైల్వేస్టేషన్ రోడ్డులోని లాడ్జి గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించడంతో ఆమె ప్రతిఘటించింది. ఇంటికి వెళ్లిన అనంతరం, జరిగిన విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నెల 1న రమావత్ నర్సింగ్ నాయక్ పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

అయితే, ఈ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాల్సిన పోలీసులు జాప్యం చేయడమే కాకుండా, స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ ఎస్సై బేరం కుదుర్చుకున్నారని ఆరోపణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో నర్సింగ్ నాయక్ ను నిన్న అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నర్సింగ్ కు రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
YSRCPmacherla

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more