రాజకీయ అరంగేట్రంపై ఇంకా ఆలోచించలేదు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

03-05-2018 Thu 21:51 | Andhra
  • శ్రీకాకుళంలో 3 రోజుల పర్యటన ప్రారంభించిన లక్ష్మీనారాయణ
  • షూరిటీ పెట్టినా రైతులకు రూ.5 లక్షలివ్వని బ్యాంకులు! 
  • ఈ విధానంలో మార్పు రావాలి
  • ‘హోదా’ విషయంలో కేంద్రం అన్యాయం చేస్తే నేనూ ప్రత్యక్ష పోరాటానికి దిగుతా
ప్రస్తుతం ప్రజా సమస్యలపైనే దృష్టి పెడుతున్నానని, తన రాజకీయ అరంగేట్రంపై ఇంకా ఆలోచించలేదని ఐపీఎస్ మాజీ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు తన పర్యటన ప్రారంభించారు. స్థానిక వాసవీ తిరుమల కల్యాణ మండపంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, పరిశ్రమలు పెడతామంటే రూ.50 లక్షలు రుణంగా ఇచ్చే బ్యాంకులు, ఐదెకరాలు షూరిటీగా పెట్టినా రైతులకు రూ.5 లక్షలు ఇవ్వడం లేదని .. ఈ విధానంలో మార్పు రావాలని అన్నారు. పూర్తిగా రైతు సమస్యలు అధ్యయనం చేసిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు.

మహాత్మా గాంధీ నడయాడిన ప్రాంతంలో తాను నిద్రచేయనుండటం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. ‘హోదా’ విషయమై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశిస్తున్నానని, ఒకవేళ కేంద్రం అన్యాయం చేస్తే తాను కూడా ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని అన్నారు.

’నేను 28 సంవత్సరాల సర్వీసు చేశాను. అందులో ఏడు సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ లో, ఇరవై ఒక్క సంవత్సరాలు మహారాష్ట్రలో పని చేశా. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలనేది నా కోరిక. అందుకని, శ్రీకాకుళం నుంచి ఈరోజు శ్రీకారం చుట్టాను.13 జిల్లాలలోనూ పర్యటిస్తా. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? ప్రజల సమస్యలు.. వాటి పరిష్కారాల గురించి వారితో చర్చించాలనేది మొదటి అంశంగా ఎంచుకున్నాను. ఇది పూర్తయిన తర్వాత నాకు కూడా ఎక్కువ అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో ఆ మార్గాన్ని నేను ఎంచుకుంటా’ అని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.
laxminarayanaSrikakulam District

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more