పూణేలోని రాజ్ భవన్ సమీపంలో ఎర్రచందనం దుంగల చోరీ!

03-05-2018 Thu 16:24 | National
  • ఐదు ఎర్రచందనం చెట్లను నరికివేసిన దుండగులు 
  • ఒక్కో చెట్టు విలువ సుమారు రూ.20 వేలు
  • ఒక్కో చెట్టు వయసు ఎనిమిది నుంచి పదేళ్లు  
మహారాష్ట్ర గవర్నర్ వర్షాకాలపు విడిదిగా వున్న పూణే నగరంలోని రాజ్ భవన్ పరిసరాల్లో విలువైన ఎర్రచందనం చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికివేశారు. గత నెల 30న జరిగిన ఈ సంఘటన సమాచారాన్ని గవర్నర్ విద్యాసాగర్ రావుకు రాజ్ భవన్ సిబ్బంది తెలియజేసింది. రాజ్ భవన్ పరిసరాల్లోని ఐదు ఎర్రచందనం చెట్లను వాటి మొదళ్ల వరకు నరికివేసిన గుర్తుతెలియని వ్యక్తులు వాటిని ఎత్తుకుపోయారని, ఒక్కో చెట్టు విలువ సుమారు రూ.20 వేల వరకు ఉంటుందని రాజ్ భవన్ సిబ్బంది తెలిపారు.

నరికివేతకు గురైన ఒక్కో చెట్టు వయసు ఎనిమిది నుంచి పది సంవత్సరాల వరకు ఉంటుందని సమాచారం. రాజ్ భవన్ కు అత్యంత సమీపంలోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. అయినప్పటికీ, దుండగులు ఈ చెట్లను నరికివేయడం గమనార్హం. ఈ సంఘటనపై చతుశృంగి పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రాజ్ భవన్  సమీపంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. రెండేళ్ల కాలంలో ఈ ఘటన చోటుచేసుకోవడం రెండోసారి. సెక్యూరిటీ సిబ్బంది, సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ ఎంతో ఖరీదు చేసే ఎర్రచందనం కోసం గుర్తుతెలియని వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని రాజ్ భవన్ సిబ్బంది అంటున్నారు.
Maharashtrarajbhavanred sandal wood

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more