శాన్ ఫ్రాన్సిస్కోలో ఎన్నారై ఘాతుకం... సహోద్యోగిని డేటింగ్ కు రాలేదన్న కక్షతో ఆమె బాయ్ ఫ్రెండ్ హత్య!

03-05-2018 Thu 12:20 | International
  • శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో పనిచేస్తున్న కెవిన్ ప్రసాద్
  • అక్కడే పనిచేసే యువతిపై కన్నేసిన ప్రసాద్
  • అంగీకరించకపోవడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ హత్య
తనతో డేటింగ్ కు వచ్చేందుకు ఓ యువతి అంగీకరించడం లేదన్న ఆగ్రహంతో ఆమె బాయ్ ఫ్రెండ్ ను హత్య చేశాడో ప్రవాస భారతీయ యువకుడు. ఇప్పుడు అతనికి మరణశిక్ష లేదా జీవితఖైదు తథ్యమని అంటున్నారు అక్కడి న్యాయనిపుణులు. కాలిఫోర్నియా పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం కెవిన్ ప్రసాద్ (31) శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ సేవలందిస్తున్నాడు.

అదే చోట ఓ యువతి కూడా పనిచేస్తోంది. ఆమెను ఎలాగైనా వశం చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రసాద్ పలుమార్లు ఆమెను డేటింగ్ కు రమ్మని ఆహ్వానించాడు. నగలు కూడా బహూకరించి మభ్యపెట్టాలని చూశాడు. అయితే, దాన్ని తిరస్కరించిన ఆమె, తనకు దీర్ఘకాలంగా మార్క్ మంగాక్కట్ (31) అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, తమకు మూడేళ్ల బిడ్డ కూడా ఉందని చెప్పి తప్పించుకునేది.

ఈ క్రమంలో తలకు ముసుగు ధరించిన ఓ యువకుడు మంగాక్కట్ కారు వద్దకు వచ్చి అతన్ని తుపాకితో కాల్చి చంపాడు. విచారణ ప్రారంభించిన పోలీసులకు తొలుత నిందితుడి గురించి ఒక్క క్లూ కూడా లభించలేదు. ఆపై విచారణలో మంగాక్కట్ కు ఎటువంటి గ్యాంగులతోనూ సంబంధం లేదని తెలిసింది. ఇదే సమయంలో అతని గర్ల్ ఫ్రెండ్ అయిన ప్రసాద్ సహోద్యోగినిని విచారిస్తున్న క్రమంలో, పనిచేసే చోట ఓ యువకుడు తనను డేటింగ్ కు రావాలని ఒత్తిడి చేస్తుండేవాడని ఆమె చెప్పగా, పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. దీంతో ప్రసాద్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడైన డొనోవాన్ మ్యాథ్యూ రివీరా సహాయంతో అతను మంగాక్కట్ ను హత్య చేశాడని పోలీసులు తేల్చారు. అతనిపై మర్డర్ కేసు పెట్టి కోర్టుకు తరలించారు.
USAPoliceKevin PrasadMurderSanfransisco

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more