గతంలో తనకు వెంట్రుకలు పెరిగేందుకు మందిచ్చిన డాక్టర్ పై దాడులు చేయించిన డొనాల్డ్ ట్రంప్!

02-05-2018 Wed 09:37 | International
  • ట్రంప్ బాడీగార్డులు దాడి చేశారు
  • ఆరోపించిన డాక్టర్ హెరాల్డ్ బోర్న్ స్టెయిన్
  • వైద్య నివేదికలు సేకరించామన్న వైట్ హౌస్
తల వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి మందిచ్చిన న్యూయార్క్ డాక్టర్ హెరాల్డ్ బోర్న్ స్టెయిన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడులు చేయించారట. ఈ విషయాన్ని సదరు డాక్టరే స్వయంగా వెల్లడించారు. గత సంవత్సరం ట్రంప్ బాడీగార్డులు తన పార్క్ అవెన్యూ ఆఫీసుపై దాడులు చేసి, ట్రంప్ మెడికల్ రికార్డులను స్వాధీనం చేసుకుని వెళ్లారని ఆరోపించారు. ట్రంప్ సంవత్సరాల తరబడి తానిచ్చిన ఔషధాన్ని వాడారని ఆయన తెలిపారు. తన ఆఫీసుకు వచ్చిన ట్రంప్ సిబ్బంది అరగంట పాటు నానా హంగామా చేశారని బోర్న్ స్టెయిన్ 'ఎన్బీసీ'కి వెల్లడించారు. వారి దాడితో తాను తీవ్రంగా భయపడ్డానని ఆయన అన్నారు.

ట్రంప్ దీర్ఘకాల బాడీగార్డ్ కీత్ స్కిల్లర్ తన వద్దకు వచ్చారని, ఆయనతో పాటు అప్పటి వైట్ హౌస్ కార్యకలాపాల నిర్వహణాధికారి అలెన్ గార్టెన్, ట్రంప్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న నిర్మాణ రంగ సంస్థకు చెందిన లాయర్ తన వద్దకు వచ్చారని ఆయన చెప్పారు. ట్రంప్ కు సంబంధించిన ల్యాబ్ రిపోర్టుల ఒరిజినల్ కాపీలు, పలు రకాల డాక్యుమెంట్లను వారు తీసుకుని వెళ్లారని తెలిపారు. కాగా, దాడి వార్తలు ఆరోపణలేనని, కల్పితాలని వైట్ హౌస్ స్పందించింది. అధ్యక్షుడి గత వైద్య పరీక్షలకు, వాటి ఫలితాలకు సంబంధించిన రికార్డులు సేకరించడం వైట్ హౌస్ హక్కని మెడికల్ ఆఫీసర్ తెలిపారు.
TrumpHair GrowthRaidUSAWhite House

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more