సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

02-05-2018 Wed 07:27 | Entertainment
  • అమలాపాల్ యోగా కబుర్లు 
  • 'సాహో' కోసం భారీ చేజింగ్ దృశ్యాలు 
  • హైదరాబాదుకు వస్తున్న అజిత్ 
  • క్లైమాక్స్ కొచ్చిన గోపీచంద్ 'పంతం'
*  'ఈమధ్య యోగాకి బాగా ఎడిక్ట్ అయిపోయాను' అంటోంది కథానాయిక అమలాపాల్. 'వర్తమానంలో జీవించడాన్ని యోగా మనకు నేర్పుతుంది. అందుకే ప్రతి రోజూ యోగా చేయనిదే ఉండలేను. ఈమధ్య ఎంతో కష్టపడి శీర్షాసనం కూడా నేర్చుకున్నాను. ఈ ఆసనం వల్ల మనసు ఎంతో తేలికపడుతుంది. అందుకే కష్టమైనా పట్టుబట్టి మరీ నేర్చుకున్నాను' అని చెప్పింది అమల.  
*  సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'సాహో' చిత్రం కోసం ప్రస్తుతం దుబాయ్ లో భారీ ఎత్తున యాక్షన్ దృశ్యాలను, చేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్న ఈ చేజింగ్ దృశ్యాలలో వోల్వో బస్సులు, లావిష్ కార్లు, స్పోర్ట్స్ బైకులు వినియోగిస్తున్నారు.
*  తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం పేరు 'విశ్వాసం'. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగు ను ఈ నెల 7 నుంచి హైదరాబాదులో నిర్వహిస్తారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు.  
*  గోపీచంద్ హీరోగా నూతన దర్శకుడు చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న 'పంతం' చిత్రం క్లైమాక్స్ దృశ్యాలను ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పాటలను త్వరలో యూకేలో చిత్రీకరిస్తారు.  
AmalaPrabhasAjithGopichand

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more