ఇక ప్రజల మధ్యలోకి వెళతా.. తెలంగాణలోనూ పోటీకి ప్రణాళిక వేస్తాం: పవన్ కల్యాణ్‌ ప్రకటన
Add ap7am to your home Screen

ఇక ప్రజల మధ్యలోకి వెళతా.. తెలంగాణలోనూ పోటీకి ప్రణాళిక వేస్తాం: పవన్ కల్యాణ్‌ ప్రకటన

  • తెలంగాణకి సంబంధించిన క్యాడర్‌నూ బలోపేతం చేస్తాం 
  • ఆగస్ట్ రెండో వారంలో ప్రాథమిక ప్రణాళిక ప్రకటన
  • ఈ నెల 11వ తేదీలోగా ఏపీ పర్యటనలకు ప్రణాళిక
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మరో వైపు తెలంగాణకి సంబంధించిన క్యాడర్ ను కూడా బలోపేతం చేస్తున్నామని, ఈ ఏడాది ఆగస్ట్ రెండో వారం నాటికి తెలంగాణలో పోటీకి సంబంధించి ప్రాథమిక ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు.
 
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధనపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజా సమస్యలను తెలియపరిచేలా ప్రజల మధ్యలోకి వెళదామని వపన్ కల్యాణ్ తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 11వ తేదీలోగా ఈ పర్యటనలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఏ ఊరు నుంచి ఈ యాత్ర ఉంటుందనే విషయాన్ని త్వరలోనే చెబుతానని, తాను ప్రకటించిన 48 గంటల్లోగా ప్రజల మధ్యలో ఉంటానని అన్నారు.

Pawan Kalyan
Jana Sena
Hyderabad

More Telugu News