నేను సన్నబడటానికి కారణం ఇదే: హీరోయిన్ అంజలి

  • సినిమాల కోసం సన్నబడలేదు
  • నా ఫిజిక్ నాకే ఇబ్బందిగా అనిపించింది
  • నా సిస్టర్ కు పెళ్లయింది.. ఆమెకు నటించాలనే కోరిక లేదు
బొద్దుగా ఉండే హీరోయిన్ అంజలి ఇప్పుడు కాస్త సన్నబడటం ఆసక్తికరంగా మారింది. ఇదే ప్రశ్నను ఓ మీడియా సంస్థ ఆమె ముందు ఉంచగా... సినిమాల కోసం తాను సన్నబడలేదని చెప్పింది. ఈ మధ్య కాలంతో కాస్త బొద్దుగా మారానని... తన ఫిజిక్ తనకే ఇబ్బందిగా అనిపించిందని... అందుకే ప్రత్యేకంగా ఓ ట్రైనర్ ను పెట్టుకుని సన్నబడ్డానని తెలిపింది.

గతంలో శరీరాకృతిపై పెద్దగా ఫోకస్ పెట్టలేదని... దాంతో, వయసుకు మించి పెద్దదానిలా కనిపించానని చెప్పింది. అలా బొద్దుగా కనిపించడం తన కెరీర్ కు కూడా మైనస్ అయిందని... సీనియర్ హీరోలతోనే సినిమాలు వచ్చేవని తెలిపింది. ఇప్పుడు సన్నబడ్డాక... జూనియర్లతో కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయని చెప్పింది.

మీ సోదరిని కూడా సినిమాల్లోకి తీసుకువస్తున్నారనే వార్తలు వస్తున్నాయని అని ప్రశ్నించగా... తన సిస్టర్ కు పెళ్లయిందని, ఆమెకు నటించాలన్న కోరిక, ఆలోచన రెండూ లేవని అంజలి తెలిపింది. 
Go Back to Shorts
anjali
tollywood
kollywood
fitness

More Telugu News