anil kapoor: తన కూతురు పెళ్లిపై హీరో అనిల్ కపూర్ స్పందన!

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె, హీరోయిన్ సోనమ్ కపూర్ ప్రేమ వివాహం చేసుకోబోతోంది. ఢిల్లీకి చెందిన ఆనంద్ అహూజాతో కొన్నేళ్లుగా ఆమె ప్రేమలో ఉంది. సోనమ్ కపూర్ కుటుంబంలో జరిగిన అనేక కార్యక్రమాలకు ఆనంద్ హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో, త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ బాలీవుడ్ మీడియా కథనాలు రాస్తోంది.

తాజాగా ముంబైలోని అనిల్ కపూర్ నివాసాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో, ఇంట్లో పెళ్లి సందడి మొదలైందనే వార్తలు వెల్లువెత్తాయి. పెళ్లి ఏర్పాట్లలో భాగంగానే, విద్యుత్ దీపాలతో అలంకరించారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ అంశంపై తాజాగా అనిల్ కపూర్ స్పందించాడు. సరైన సమయంలో అన్ని విషయాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. తన కెరీర్ తొలినాళ్ల  నుంచి మీడియా తనకు ఎంతో సపోర్ట్ చేసిందని... తమ కుటుంబంలో ఏది జరిగినా మీడియాకు సవివరంగా వెల్లడిస్తామని.. తన కుమార్తె పెళ్లి విషయంలో దాచేందుకు ఏమీ లేదని చెప్పారు. 
anil kapoor
sonam kapoor
anand ahuja
wedding

More Telugu News