మందుకొట్టి వాహనాలను నడపవద్దని పోలీసులు ఎంతగా చెబుతున్నా మందుబాబులు తమ తీరును మార్చుకోవడం లేదు. గత రాత్రి హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, మొత్తం 126 మంది మందుకొట్టి డ్రైవింగ్ చేస్తూ దొరికిపోయారు.

వీరిలో పలువురు అమ్మాయిలు కూడా ఉండటం గమనార్హం. మొత్తం 46 కార్లను, 80 బైకులను స్వాధీనం చేసుకున్నామని, వీరందరికీ సోమవారం నాడు కౌన్సెలింగ్ నిర్వహించి, ఆపై కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో కొంతమంది రెండోసారి, మూడోసారి దొరికిపోయిన వారు ఉన్నట్టు తెలుస్తోంది.