ప్రెస్ నోట్: హ్య‌స్ట‌న్‌లో అట్ట‌హాసంగా గోదావ‌రి సిల్వ‌ర్ జూబ్లీ కేంద్రం ప్రారంభం

27-04-2018 Fri 19:30 | International
ప్రెస్ నోట్: ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ‌, వేగంగా ఎదుగుతున్న రెస్టారెంట్ చైన్ “గోదావ‌రి” త‌న 25వ కేంద్రాన్ని హ్యూస్ట‌న్‌, టెక్సాస్‌లో ఈ వారాంతంలో ఏప్రిల్ 28న ప్రారంభించేందుకు సిద్ధ‌మైంది.
 
“గోదావ‌రి”ని ఉత్సాహం, స్ఫూర్తివంత‌మైన ఆలోచ‌న తీరు క‌లిగిన‌ యువ వ్యాపార‌వేత్త‌లు ప్రారంభించిన సంగ‌తి ప్ర‌పంచానికి కొత్త‌గా ప‌రిచ‌యం చేయ‌న‌వ‌సరం లేదు. కేవ‌లం 35 నెల‌ల కింద‌ట బోస్ట‌న్‌లో ప్రారంభ‌మైన “గోదావ‌రి” హ్యూస్ట‌న్‌లో వారి సిల్వ‌ర్ జూబ్లీ కేంద్రాన్ని ప్రారంభిస్తోంది.
 
హ్యూస్ట‌న్‌లోని ప్ర‌ధాన మార్గ‌మైన వెస్ట్ హీమ‌ర్ కాల‌నీలో 120 సీట్ల సామ‌ర్థ్యంతో 150 సీట్ల బాంక్వెట్ హాల్‌తో అత్యంత‌ కీల‌క‌మైన కేంద్రంలో గోదావ‌రి సిల్వ‌ర్‌జూబ్లీ బ్రాంచ్ ప్రారంభం అవుతోంది.
 
అతిథుల‌తో ఇంత పెద్ద ఎత్తున “గోదావరి” ఆద‌రాభిమానాలు పొందేందుకు ప్ర‌ధాన కార‌ణం అవి కొలువుదీరి ఉన్న కేంద్రాలే. హ్యూస్ట‌న్‌లో ప్రారంభ‌మైన ఈ కేంద్రం కూడా “గోదావ‌రి” కీర్తిని మ‌రింత పెంచేదిగా ఉంటుంది.
 
అత్యుత్త‌మ బాంక్వెట్ హాల్‌ను క‌లిగి ఉన్న గోదావ‌రి హ్యూస్ట‌న్ (Indian restaurants in Houston) త‌న‌దైన ప్ర‌త్యేక‌త అయిన‌ ప‌ల్లె సీమ‌ల ఆత్మీయ రుచుల‌ను కూడా అతిథుల‌కు అందించ‌నుంది. “ఈ ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టును విజ‌య‌వంతం చేసేందుకు విజ‌య‌వంతం చేసేందుకు మేం తీవ్రంగా శ్ర‌మిస్తున్నాం. ఎందుకంటే ఇటు గోదావ‌రి అటు హ్యూస్ట‌న్ చ‌రిత్ర‌లో ఈ ప్ర‌ముఖ కేంద్రంలో గోదావ‌రి ఏర్పాటు అవుతోంది” అని గోదావ‌రి హ్యూస్ట‌న్‌కు చెందిన నాగ‌రాజు చికోటి మ‌రియు మ‌ధు వెల్ల‌డించారు.
 
“గోదావ‌రి” ప్రారంభం అంటేనే స‌హజంగా అంద‌రూ వినూత్న వంట‌కాల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారి ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేందుకు ప‌లు నోరూరించే రుచుల‌ను సిద్ధంగా ఉంచాం. “అబ్బాయి ఇడ్లీ & పాపాయి పాయ‌సం”, “తాగుబోతు కోడివేపుడు”, “తంగ‌బాలి బిర్యానీ”, “రంగ‌మ్మ‌రాగి సంక‌టి”, “రెడ్డిగారి మాంసం వేపుడు”, “జ్యోతిల‌క్ష్మి జున్ను” వంటివే కాకుండా మ‌రెన్నో కూడా సిద్ధంగా ఉన్నాయ‌ని గోదావ‌రి హ్యూస్ట‌న్‌కు చెందిన నాగ‌మ‌ణి మరియు వ‌రుణ్ వెల్ల‌డించారు.
 
“ప్ర‌పంచ ఆహార‌ప‌రిశ్ర‌మ‌లో భార‌తీయ రుచుల ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి ‘గోదావ‌రి’ ఇటీవ‌లే త‌న ప్ర‌యాణం ప్రారంభించింది. అయితే, ఇప్ప‌టికే మేం ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు క‌లిగి ఉన్నాం. అతిథుల మ‌న్న‌న‌లు పొంది ఉన్నాం. ఆత్మీయ ప‌ల్లె వాతావ‌ర‌ణంలో గోదావ‌రికి మాత్ర‌మే ప్ర‌త్యేక‌మైన మెనూతో మేం అందిస్తున్న రుచులు మాకు ఎంతో ఆద‌ర‌ణ‌ను ద‌క్కిస్తున్నాయి.
 
మ‌స్క‌ట్‌, కెన‌డా మ‌రియు ఆస్ట్రేలియాకు ఈ ఏడాదిలోనే మేం విస్త‌రించ‌నున్నాం. దీంతోపాటుగా అమెరికాలోని మ‌రిన్ని న‌గ‌రాల్లో కూడా మేం మా కేంద్రాల‌ను తెరుస్తాం” అని  టీం గోదావ‌రి త‌ర‌ఫున‌ తేజా చేకూరి (Teja Chekuri)వెల్ల‌డించారు.
 
“25 గోదావ‌రి కేంద్రాలు ప్రారంభించుకోవ‌డం అనేది కేవ‌లం సంఖ్య‌ను సూచించేది మాత్ర‌మే కాదు. 300 మందికి పైగా బృందం త‌మ కుటుంబ స‌భ్యుల‌ను మాతృదేశంలో వ‌దిలి ఈ దేశంలో ఉండి నిరంతరం చేస్తున్న శ్ర‌మ ఫ‌లితం. వ్యాపారంలో స‌హ‌జంగా ఉండే ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా 25 ఫ్రాంచైజీల య‌జ‌మానులు మాకు అండ‌గా ఉండటం, మాతో పాటు క‌లిసి న‌డవ‌డం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది.
 
మా అంద‌రి స‌మూహాన్ని మేం “గోదావ‌రి కుటుంబం” అని గ‌ర్వంగా చెప్పుకొంటున్నాం. రాబోయే కొన్నేళ్ల‌లో మ‌రింత పెద్ద ఎత్తున విస్త‌రించ‌నున్నాం. మ‌రిన్ని దేశాల్లో మా ముద్ర‌ను చాటుకోనున్నాం” అని కౌశిక్ కోగంటి ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.
 
హ్యూస్ట‌న్‌, టెక్సాస్‌లో (Best South Indian restaurant in Houston) ఏర్పాట‌య్యే మా ‘గోదావ‌రి’లో ఆత్మీయ భోజ‌నాన్ని మీరంతా ఆస్వాదించాల‌ని ఆహ్వానిస్తున్నాం.
 
రండి సంతోషాల‌ను, ఆత్మీయ క్ష‌ణాల‌ను పంచుకునేందునే రుచిక‌ర‌మైన గోదావ‌రి రుచుల‌ను అనుభూతి చెందండి.
 
చిరునామా
గోదావ‌రి హ్యూస్ట‌న్‌
8092  వెస్ట్ హీమ‌ర్ రోడ్‌
హ్యూస్ట‌న్‌, టెక్సాస్ 77063
832-581-2922
 
సంప్ర‌దించండిః
నాగ చికోటి
Houston@GodavariUS.com 
860-514-4099
 
మ‌రోమారు మీ అందరికీ కృత‌జ్ఞ‌త‌లు. మా ఆత్మీయ‌ వంట‌కాల‌ను ఆస్వాదించండి.
 
www.GodavariUS.com 
 
Press released by: Indian Clicks, LLC
GodavariUS

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more