ఇప్పటి నుంచి నేను చేసే పోస్ట్ లకు, ‘పీకే’కు ఎటువంటి సంబంధం లేదు: నటి శ్రీరెడ్డి
Add ap7am to your home Screen

ఇప్పటి నుంచి నేను చేసే పోస్ట్ లకు, ‘పీకే’కు ఎటువంటి సంబంధం లేదు: నటి శ్రీరెడ్డి

  • ఈ విషయం గుర్తుంచుకోండి.. ఇది నా వినయపూర్వక వినతి
  • పీకే గురించి ప్రస్తావించడం ఆపేశాను
  • నేను చేసే ప్రతి పోస్ట్ ను పీకేకు  ఆపాదించొద్దు
ఇప్పటి నుంచి తాను చేసే పోస్ట్ లకు, పీకేకు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నానని నటి శ్రీరెడ్డి అన్నారు. ఈ మేరకు ‘ఫేస్ బుక్’లో ఓ పోస్ట్ చేసింది.

 ‘చివరిసారిగా  అందరికీ ఒక విషయం చెబుతున్నాను.. అంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను.. పీకే గురించి ప్రస్తావించడం ఆపేశాను. నేను చేసే ప్రతి పోస్ట్ ను అనవసరంగా పీకేకు ఆపాదించవద్దు..’ అని శ్రీరెడ్డి కోరింది.

మరో పోస్ట్ లో.. ‘‘5 కోట్ల రూపాయల అంశం గురించి చాలామంది మాట్లాడుకుంటున్న కారణంగానే ఈ పోస్ట్ చేశాను’ అంటూ  ‘మంచి వ్యక్తిగా జీవిస్తే చాలు. వెధవల దగ్గర నిరూపించుకోవాల్సిన పనిలేదు’ అనే కొటేషన్ ను శ్రీరెడ్డి జతపరిచింది.



Tollywood
srireddy
Pawan Kalyan

More Telugu News