విద్యార్హతల కేసులో కోమటిరెడ్డికి హైకోర్టులో ఊరట

  • పిటిషన్ వేసిన నరసింహారెడ్డి, భూపాల్ రెడ్డి
  • మూడేళ్లుగా కొనసాగిన వాదనలు
  • పిటిషనర్లకు చెరో 25 వేల జరిమానా
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన విద్యార్హతలకు సంబంధించి దుబ్బాక నరసింహారెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డిలు వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ పిటిషన్ దారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం... చెరో రూ. 25 వేల జరిమానాను విధించింది. గత మూడేళ్లుగా ఈ పిటిషన్ కు సంబంధించి కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడిన విషయంలో కూడా కోమటిరెడ్డికి ఇటీవల ఊరట లభించిన సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
komatireddy venkatreddy
High Court

More Telugu News