అమ్మవారిని దర్శించుకుని.. సినిమా చూసేందుకు వెళ్లిన మహేష్ బాబు
Add ap7am to your home Screen

అమ్మవారిని దర్శించుకుని.. సినిమా చూసేందుకు వెళ్లిన మహేష్ బాబు

  • విజయవాడలో మహేష్ బాబు సందడి
  • అభిమానులతో కలసి సినిమా చూడనున్న సూపర్ స్టార్
  • ట్రెండ్ సెట్ మాల్ లో అభిమానుల ముందుకు మహేష్
బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని సినీ హీరో మహేష్ బాబు దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఆయన బావ, ఎంపీ గల్లా జయదేవ్, దర్శకుడు కొరటాల శివ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా సినీ అభిమానులు భారీ సంఖ్యలో అక్కడకు వచ్చారు.

అమ్మవారి దర్శనానంతరం వీరంతా గవర్నర్ పేటలోని అన్నపూర్ణ థియేటర్ కు వెళ్లారు. అభిమానులతో కలసి వీరు 'భరత్ అనే నేను' సినిమా చూడనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బెంజిసర్కిల్ లోని ట్రెండ్ సెట్ మాల్ లో అభిమానులను మహేష్ కలుసుకుంటారు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటిస్తారు.  
Mahesh Babu
Koratala Siva
galla jayadev
Bharath Ane Nenu

More Telugu News