క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి ధర్నా చేస్తే నాకు సంబంధం ఏంటి?: నారా లోకేశ్
- పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారా లోకేశ్
- పవన్ నాపై ఆరోపణలు చేస్తున్నారు
- ఆధారాలు ఉంటే బయట పెట్టాలని ట్విట్టర్లో కోరాను
తనపై పవన్ చేస్తోన్న ఆరోపణల్లో ఆధారాలు ఉంటే బయట పెట్టాలని తాను ఇప్పటికే ట్విట్టర్లో కోరానని నారా లోకేశ్ చెప్పారు. తాను ఎనిమిదేళ్ల నుంచి తన ఆస్తులు ప్రకటిస్తున్నానని అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ విధానంపై శ్రీరెడ్డి ధర్నా చేస్తే తనకు సంబంధం ఏంటని లోకేశ్ ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై తనకు అవగాహన లేదని, వ్యక్తిగతంగా పవన్ అంటే తనకు ఎప్పుడూ గౌరవమే ఉంటుందని వ్యాఖ్యానించారు.