నోయిడాలో ఘోరం.. కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారం!

24-04-2018 Tue 20:50 | National
  • ఈ నెల 18న నోయిడాలో జరిగిన సంఘటన
  • పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా దారుణం
  • బాలిక ఎక్కాల్సిన బస్సు మిస్సవడంతో కారెక్కించుకున్న వైనం
  • నిందితులు బాలిక దూరపు బంధువు, స్నేహితుడు, మరో వ్యక్తి
ఉన్నావో, కథువా ఘటనలను మరువకముందే మరో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కదులుతున్న కారులో పదిహేడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన ఈ నెల 18న నోయిడాలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాకు చెందిన పదిహేడేళ్ల బాలిక కస్నాలోని పాఠశాలకు రోజూ బస్సులో వెళుతుంటుంది. అదే మాదిరిగా, ఈ నెల 18న పాఠశాలకు వెళ్లింది.

పాఠశాల అయిపోగానే అక్కడి నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా, మార్గమధ్యంలో ఆమె స్నేహితులు కనపడ్డారు. కారులో ఇంటివద్ద దింపుతామంటూ ఆమెను కారులో ఎక్కించుకున్నారు. కారు వెళుతుండగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిలో ఒకరు ఆ బాలికకు దూరపు బంధువు, మరొకరు అదే పాఠశాలలో చదువుకుంటున్న తోటి విద్యార్థి కాగా, ఇంకో వ్యక్తి అపరిచితుడు.

కాగా, మధ్యాహ్నం 3 గంటలకే ఇంటికి చేరాల్సిన తమ కూతురు రాకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు కంగారు పడ్డారు. రాత్రి సమయం అవుతున్నా ఆమె రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు సమీపంలో ఆరోజు అర్ధరాత్రి బాధిత బాలికను గుర్తించారు.

ఆ రోజున తాను ఎక్కాల్సిన బస్సు మిస్సవడంతో నడుచుకుంటూ వస్తుండగా, కారులో వచ్చిన ఆ ముగ్గురు తనను ఇంటి వద్ద దింపుతామంటూ నమ్మకంగా చెప్పడంతో మోసపోయానని పోలీసుల విచారణలో బాధితురాలు తెలిపింది. తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనంతరం, తనను రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారని వాపోయింది. ముగ్గురు నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.
noidakasna17 years girlmolestation

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more