బాలీవుడ్‌ దంపతులు సైఫ్‌ అలీ ఖాన్‌, అమృతా సింగ్ ల కుమార్తె సారా అలీ ఖాన్‌ తాజాగా దివ్యభారతి పాటకు స్టెప్పులేసి బాలీవుడ్ సెలబ్రిటీలను ఆకట్టుకుంది. 'కేదార్ నాథ్', 'సింబా' సినిమాల్లో నటిస్తున్న సారా.. ప్రముఖ ష్యాషన్‌ డిజైనర్స్‌ అబూ జానీ, సందీప్‌ ఖోస్లాల బంధువుల పెళ్లి రిసెప్షన్‌ కి హాజరైంది.

ఈ సందర్భంగా 'విశ్వాత్మ' సినిమాలో దివ్యభారతి నటించిన సాత్ సముందర్ పాటకు డాన్స్ చేసింది. ఆమె వేసిన స్టెప్పులకు ఆహూతులు కేరింతలు కొట్టారు. సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేయగా అది వైరల్ అవుతోంది. కాగా, ఈ వేడుకలో అమితాబ్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌, కరణ్‌ జోహార్‌, సోనమ్‌ కపూర్ తదితరులు సందడి చేశారు.  
Play video