అక్షర యోధుడిని ఆదుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌

22-04-2018 Sun 18:45 | Telangana
  • పక్షవాతంతో మంచానికి పరిమితం అయిన చైతన్య ప్రకాశ్
  • మూడు లక్షల అర్థిక సాయం 
  • 25 ఏళ్లుగా సాహితీ సేవలో ఉన్న కవి
  • రేకుల షెడ్డులో తల్లితో జీవనం సాగిస్తోన్న ప్రకాశ్
దయనీయ పరిస్థితుల్లో ఉన్న అభ్యుదయ కవి, కథా రచయిత చైతన్య ప్రకాశ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. సిరిసిల్ల రాజన్న జిల్లాలోని ముస్తాబాద్ మండలానికి చెందిన చైతన్య ప్రకాశ్‌ 25 సంవత్సరాలుగా అనేక కథలు, పుస్తకాలు రాశారు. సామాజిక చైతన్యం, వామపక్ష భావజాలంతో సాహిత్యాన్ని అందిస్తోన్న చైతన్య ప్రకాశ్ ప్రస్తుతం పక్షవాతంతో బాధపడుతూ తన తల్లి, సోదరి వద్ద కాలం వెళ్లదీస్తున్నారు.

తెలుగులో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన చైతన్య ప్రకాశ్ గతంలో మూడు పుస్తకాలు, వందలాది కవితలను రాశారు. మరుగున పడిపోతున్న తెలంగాణ పల్లె పదాలను, సామెతలను ఒక్కచోట చేర్చి ప్రకాశ్ రాసిన ఆరువేల తెలంగాణ సామెతలతో కూడిన పుస్తకాన్ని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం ఆవిష్కరించింది. గత ఫిబ్రవరిలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన చైతన్య ప్రకాశ్, కరీంనగర్ లోని అపోలో రీచ్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు.

అయనకు పక్షవాతం వచ్చిందని, దీర్ఘకాలంగా మందులు వాడాలని, అప్పుడే ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని డాక్టర్లు తెలిపారు. 25 సంవత్సరాలుగా సాహిత్య సేవను మాత్రమే నమ్ముకున్న సత్య ప్రకాశ్ సంపాదించుకున్నదేమీ లేదు. ప్రస్తుతం సిరిసిల్లలోని తన మిత్రుడు ఇచ్చిన రేకుల షెడ్డులోనే తల్లి, సోదరితో ప్రకాశ్‌ నివాసం ఉంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా, సొంతంగా కాలకృత్యాలు సైతం తీర్చుకోలేని దయనీయ స్థితిలో ఉన్న చైతన్య ప్రకాశ్‌ను ఆయన సాహితీ మిత్రులు పరామర్శించారు. ఆయన పరిస్థితి చివరకు మంత్రి కేటీఆర్‌ దృష్టికి వచ్చింది.

వెంటనే తన కార్యాలయ సిబ్బందికి ప్రకాశ్‌ను ఆదుకోవాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం చైతన్య ప్రకాశ్‌తో మాట్లాడి ఆయన చికిత్సకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. దీంతో పాటు తన కనీస అవసరాలు తీర్చుకునేందుకు 3 లక్షల రూపాయల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం వైపు నుంచి మంత్రి మంజూరు చేయించారు. ఈ రోజు ఆ ఆర్థిక సాయాన్ని చైతన్య ప్రకాశ్‌కు మంత్రి కార్యాలయం అందించింది. అచేతనంగా పడి ఉన్న తన కొడుకుకు ఆర్థిక సాయం అందించిన కేటీఆర్‌కి చైతన్య ప్రకాశ్‌ తల్లి ఎల్లమ్మ కృతజ్ఞతలు తెలిపింది.
KTRprakashTelangana

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more