దటీజ్ గేల్! ఐపీఎల్‌లో తొలి రెండు మ్యాచులు ఆడకున్నా అతడే టాప్!

22-04-2018 Sun 08:17 | Sports
  • ఆడిన మూడు మ్యాచుల్లో రెండు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ
  • 21 సిక్సర్లతో అందులోనూ ముందు
  • రెండుసార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకున్న వైనం
ఐపీఎల్‌ వేలంలో చివరి నిమిషంలో అమ్ముడుపోయి, ఆపై జరిగిన రెండు మ్యాచులకు రిజర్వు బెంచ్‌కే పరిమితమైన విండీస్ విధ్వంసకర ఆటగాడు, కింగ్స్ ఎలెవన్ జట్టు ఓపెనర్ క్రిస్ గేల్ తానెంత స్పెషలో మరోసారి చాటిచెప్పాడు. గత సీజన్‌లో ఫెయిలయ్యాడన్న అపనమ్మకమో, ఏమో కానీ ఐపీఎల్‌లో భాగంగా జరిగిన తొలి రెండు మ్యాచులకు పంజాబ్ జట్టు గేల్‌ను దూరం పెట్టింది.

మొహాలీలో 15న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌కు ఆడే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేసిన గేల్ జట్టు విజయంలో కీలక  పాత్ర పోషించాడు. 19న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ శివాలెత్తిపోయాడు. 63 బంతుల్లో 11 సిక్సర్లు, ఒకే ఒక్క ఫోర్‌తో అజేయ సెంచరీ (104) చేసి తానేంటో మరోసారి నిరూపించాడు. ఇక తాజాగా శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ మరోసారి రెచ్చిపోయాడు. 38 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు.

ఆడిన మూడు మ్యాచుల్లోనూ 50కిపైగా పరుగులు చేసిన గేల్ మొత్తం 229 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి రెండు మ్యాచ్‌లు ఆడకున్నా పరుగుల వేటలో మాత్రం గేల్ ముందుండడం విశేషం. అంతేకాదు, మూడు మ్యాచుల్లో రెండింటిలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు. అలాగే ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 21 సిక్సర్లు బాదిన గేల్ ఈ విషయంలోనూ ముందున్నాడు.
Chris gayleIPLPunjab

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more