నేను ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడే ముందుకెళ్తున్నాను: పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్

20-04-2018 Fri 07:27 | Both States
  • చనిపోవడానికి సిద్ధపడితే ఓటమి భయం ఉంటుందా?
  • వివాదాల్లోకి లాగిన తరువాత పరువు పోతుందని భయపడతారా?
  • చనిపోవడానికే సిద్ధపడితే దేనికైనా వెనుకంజ వేస్తాడా?
ఈ రోజు నుంచి ఏ క్షణంలో అయినా చనిపోవడానికి సిద్ధపడే ముందుకు వెళ్తున్నాను అంటూ ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. జనసైనికులను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ వివరాల్లోకి వెళ్తే.. ‘స్వశక్తితో జీవించే వాడు, ఆత్మగౌరవంతో బతికేవాడు చనిపోవడానికి సిద్ధపడితే ఓటమి భయం ఉంటుందా?.. ఆత్మగౌరవంతో బతికే వాళ్లని, సంవత్సరాలుగా సంబంధం లేని వివాదాల్లోకి పదేపదే లాగిన తరువాత పరువుపోతుందని భయపడతారా?... అధికారంలో ఉన్నవాళ్లకి, మీడియాని చేతుల్లో పెట్టుకున్న వారికి, అంగబలం, అర్థబలం ఉన్నవారికి, వారు చేసే అత్యాచారాలకి, స్వశక్తితో జీవించే వాడు, ఆత్మగౌరవంతో బతికేవాడు ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడితే అసలు దేనికైనా భయపడతాడా? వెనుకంజ వేస్తాడా?..

అందుకే నా ప్రియమైన అక్కచెళ్లెళ్లు, ఆడబడుచులు, జనసేనను ఆదరించే ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నుంచి ఏ క్షణంలో అయనా చనిపోవడానికి సిధ్ధపడి ముందుకు వెళ్తున్నాను. ఒకవేళ ఈ పోరాటంలో నేను చనిపోతే మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే..నిస్సహాయులకు అండగా, అధికారపు అండదండలు ఉన్నవారికే పనిచేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన విధానాలకు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడనుకుంటే చాలు’ అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
Pawan KalyanTwitter

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more