హాస్టల్‌ నుంచి ఇద్దరమ్మాయిలు వచ్చి జీవిత రాజశేఖర్‌ గురించి చెప్పారు.. ఆధారాలు రెడీ అవుతున్నాయి: సంధ్య

18-04-2018 Wed 19:49 | Both States
  • ఓ లెటర్‌ కూడా రాసుకొచ్చి నాకు ఇచ్చారు
  • వారిద్దరూ ఒక ప్రాంతంలో హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నారు
  • అందులో ఒక అమ్మాయి పల్లెటూరి నుంచి వచ్చింది
  • సినీనటుడు రాజశేఖర్‌ని ఎవరి ద్వారానో కలిసింది
సామాజిక కార్యకర్త సంధ్యపై సినీనటి, ప్రొడ్యూసర్‌ జీవిత నిన్న మండిపడ్డ విషయం తెలిసిందే. సంధ్యను వదిలిపెట్టనని, నిరాధార ఆరోపణలు చేసిందని జీవిత అన్నారు. ఈ విషయంపై సంధ్య ప్రముఖ తెలుగు న్యూస్‌ ఛానెల్‌ టీవీ9కి తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చి ఆధారాలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. రాజశేఖర్‌ను పల్లెటూరు నుంచి వచ్చిన ఓ అమ్మాయి కలిసిన తీరుపై ఆమె స్పష్టంగా వివరించి చెప్పారు.

"నేను ప్రతి మంగళవారం, శుక్రవారం కౌన్సెలింగ్‌ ఇస్తాను. ఏడేళ్ల క్రితం ఇద్దరమ్మాయిలు నన్ను కలవడానికి వచ్చారు. ఓ లెటర్‌ కూడా రాసుకొచ్చి ఇచ్చారు. వారిద్దరూ ఒక ప్రాంతంలో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. అందులో ఒక అమ్మాయి పల్లెటూరి నుంచి వచ్చి, తన పాకెట్ మనీ కోసం ఎవరి ద్వారానో సినీనటుడు రాజశేఖర్‌ని కలిసింది. ఆమె ఒక కమిట్‌మెంట్‌లో ఉంది. అయితే, దానికి మధ్యలో డీల్‌ చేసేది జీవిత. అది క్యాస్టింగ్‌ కౌచ్ కాదు. డైరెక్టుగా డీలింగ్‌.. ఆ అమ్మాయిని సెక్సువల్‌గా వాడుకోవడమన్నమాట.

నాతో వారు ఇంకా చాలా చెప్పారు. వారిని మీడియా ముందుకు తీసుకురావడం నాకు ఇష్టం లేదు. మీకు బాగా తెలుసు, 30 ఏళ్లుగా నేను ఒక్కసారి కూడా బాధితులెవ్వరినీ మీడియా ముందుకు తీసుకురాలేదు. ఆ అమ్మాయిలిద్దరినీ తీసుకొచ్చి వారి భవిష్యత్తుని దెబ్బ తీయడం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయి కజిన్ ఆంధ్రజ్యోతి ప్రెస్‌లో పని చేస్తారు. ఆయనతో చెబుతామని, పేపర్లో వేయిద్దామని ఆ అమ్మాయిలు అన్నారు. ఆంధ్రజ్యోతిలో వసంత లక్ష్మి అని ఒకావిడ ఉంటారు. ఆమెను కలవండని నేను చెప్పాను. రెండు, మూడు రోజుల్లోనే నవ్య పేజీలో ఆమె ఈ బాగోతమంతా పూర్తిగా ప్రచురించేలా చేశారు. అది ఇప్పుడు బయటకు తీసుకొచ్చి మళ్లీ చూపిస్తాం" అని సంధ్య తాను చేసిన ఆరోపణలను నిరూపించుకుంటానని స్పష్టంగా చెప్పారు.  
sandhyarajashekarTollywood

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more